రవితేజ కోసం యమలోకం సెట్


రవితేజ రాబోతున్న చిత్రం “దరువు” కోసం రామోజీ ఫిలిం సిటీ లో యమలోకం సెట్ వేశారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. తమిళ నటుడు ప్రభు ఈ చిత్రం లో యముడిగా నటిస్తున్నారు ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణగారు ఈ చిత్రం లో ఒక పాత్ర పోషిస్తున్నారు. తాపసీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బూరుగుపల్లి శివ రామకృష్ణ నిర్మిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్ అంతోనీ సంగీతం అందిస్తున్నారు. ఇది హాస్య ప్రధానమయిన చిత్రంగా ఉండబోతుంది.

Exit mobile version