శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ట్రాక్ రికార్డు చూసుకుంటే, ఆమె నటించిన రీసెంట్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాయి. కొన్ని సినిమాలు ఫ్లాపులుగా మిగలడం తో ఆమె పై నెగిటివ్ ట్రోలింగ్స్ కూడా జరిగాయి. అయితే, అమ్మడి యాక్టింగ్ కంటే డ్యాన్స్ పై సెటైర్లు వినిపించాయి.

దీంతో ఈ హాట్ బ్యూటీకి ఓ సాలిడ్ హిట్ ఇప్పుడు కంపల్సరీ గా మారింది. ఇక ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ రిలీజ్‌కు రెడీ అయింది. మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీలీల హిట్టు కొట్టాల్సిందే అని అభిమానులు ఆశిస్తున్నారు. ధమాకా సక్సెస్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల పల్లెటూరి అమ్మాయిగా, శ్రీకాకుళం యాసలో కనిపించబోతోంది.

ఇక ఈ సినిమాతో శ్రీలీల బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటుందో తెలియాలంటే మాస్ జాతర రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version