మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?

మెగాస్టార్ చిరంజీవి బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా కీ రోల్ ప్లే చేస్తారని తెలుస్తోంది. ‘మహారాజ’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టిన అనురాగ్ కశ్యప్.. ‘డెకాయిట్’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘మెగా 158’లో కూడా నటించనున్నారని తెలుస్తోంది. చిరు సినిమాలో అనురాగ్ కశ్యప్ ప్రధాన విలన్ పాత్రలో కనిపిస్తారట.

ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. ఇక ఇప్పటికే రిలీజైన ‘మెగా 158’ కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.

Exit mobile version