నిప్పు మీద గట్టి నమ్మకముంది అంటున్న వైవీఎస్ చౌదరి

నిప్పు మీద గట్టి నమ్మకముంది అంటున్న వైవీఎస్ చౌదరి

Published on Feb 6, 2012 10:53 AM IST


సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాస్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్ చౌదరి ‘నిప్పు’ చిత్రం పై చాలా నమ్మకంగా ఉన్నారు. వైవీఎస్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. ఫిబ్రవరి17 న విడుదలవుతున్న ఈ చిత్రం, పరాజయాలతో సతమతమవుతున్న వైవీఎస్ చౌదరి మరియు గుణశేఖర్ ఇరువురికీ పరీక్షలాంటిదే. ఈ చిత్ర అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందనీ, తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందని వైవీఎస్ చౌదరి అన్నారు. రవితేజ, దీక్షా సేథ్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా నటకిరీటి రాజేంద్రప్రసాద్, శ్రీరామ్ మరియు భావన కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిప్పు చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు