వరల్డ్ వైడ్ ‘జాట్’ డే 1 వసూళ్లు ఎంతంటే!

వరల్డ్ వైడ్ ‘జాట్’ డే 1 వసూళ్లు ఎంతంటే!

Published on Apr 11, 2025 2:52 PM IST

బాలీవుడ్ సీనియర్ మాస్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ చిత్రమే “జాట్”. మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని హిందీలో తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే కాగా డీసెంట్ బజ్ నడుమ ఈ చిత్రం హిందీ మార్కెట్ లో రిలీజ్ అయ్యింది. అయితే గదర్ 2 రేంజ్ లోనే చాలా మంది ఓపెనింగ్స్ ఆశించి ఉండొచ్చు కానీ కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రం జాట్ ని ఆ రేంజ్ లో హైప్ కి తీసుకెళ్లలేకపోయాయి.

కానీ నిన్న రిలీజ్ అయ్యాక మాత్రం నార్త్ లో జాట్ సాలిడ్ టాక్ ని తెచ్చుకొని అదరగొట్టింది. ఇలా డే 1 కి మేకర్స్ అఫీషియల్ నెంబర్ ని రివీల్ చేశారు. దీనితో జాట్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 11.6 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా తెలిపారు. ఇండియా వైడ్ గా 9 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించగా మిగతా మొత్తం వరల్డ్ వైడ్ అందుకుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు