వరల్డ్ వైడ్ ‘జాట్’ 6 రోజుల వసూళ్లు.. 50 కోట్ల క్లబ్ లోకి

వరల్డ్ వైడ్ ‘జాట్’ 6 రోజుల వసూళ్లు.. 50 కోట్ల క్లబ్ లోకి

Published on Apr 16, 2025 3:00 PM IST

మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని అలాగే బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “జాట్” కోసం తెలిసిందే. గోపీచంద్ సహా మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ కూడా హిందీలో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఇదే. అయితే డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ చిత్రం అదే నిలకడని కొనసాగిస్తూ వచ్చింది.

ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ కూడా మంచి వసూళ్లు ఈ సినిమా అందుకుంటుంది. ఇలా ఆరో రోజు కూడా 6 కోట్లకి పైగా వసూళ్లు ఈ సినిమా అందుకోగా మొత్తం వరల్డ్ వైడ్ గా ఈ 6 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ని దాటేసి మొత్తం 65.45 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఇదే ఫామ్ లో కొనసాగితే జాట్ డెఫినెట్ గా 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు