విజయ్ దేవరకొండ లాస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. దర్శకుడు క్రాంతి మాధవ్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. నాలుగు భిన్న నేపధ్యాలలో విజయ్ దేవరకొండ కనిపించగా ఆయన నటన ఆకట్టుకుంది. కాగా ఈ చిత్ర ఫలితం మాత్రం అనుకున్నంతగా రాలేదు. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్ గా నటించారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
కాగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ మరియు సన్ నెక్ట్స్ లో ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ఈ మూవీ పూర్తి చేసింది. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెలలో మొదలుకానుంది. ఫైటింగ్ నేపథ్యంలో తెరక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.