జై శ్రీరామ్ తో ఉదయ కిరణ్ కి లక్ కలిసొచ్చేనా?

జై శ్రీరామ్ తో ఉదయ కిరణ్ కి లక్ కలిసొచ్చేనా?

Published on Apr 9, 2013 6:30 PM IST

Uday-Kiran

కెరీర్ మొదట్లో వరుస హిట్స్ అందుకొని టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ కిరణ్ ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని సినిమాలకు దూరమయ్యాడు. చాలా కాలం తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్న విజయాన్ని మాత్రం అందుకోలేదు. అందుకే ఈ సారి లవర్ బాయ్ ఇమేజ్ ని మార్చి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘జై శ్రీరామ్’ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఉదయ కిరణ్ లుక్ బాగుంది. రేష్మా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి బాలాజీ ఎన్ సాయి డైరెక్టర్. ఉగాది కానుకగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఉగాది అన్నా ఉదయ కిరణ్ కి హిట్ ఇచ్చి కెరీర్ కి బూస్ట్ ఇస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు