హిందీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వర్కౌట్ అవుతుందా?

ఈ ఏడాదిలో తెలుగు సినిమా నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. అయితే ఈ సినిమా మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే ఈ చిత్రాన్ని హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీమేక్ చేయనున్నట్టుగా ఇపుడు బజ్ వినిపిస్తుంది.

అయితే తెలుగులో ఫ్యామిలీ ఆడియెన్స్ లో సెన్సేషనల్ హిట్ అయ్యిన ఈ చిత్రం హిందీలో కూడా అదే రీతిలో వర్కౌట్ అవుతుందా అంటే అనుమానమే అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ ట్రాక్ రికార్డు చప్పగానే ఉంది. పైగా హిందీలో రీమేక్ సినిమాలు చూడడమే జనం చాలా తగ్గించేశారు.

అలా హిందీలో ఓ రీమేక్ హిట్ అయ్యింది అంటే అది గగనమే అనుకోవాలి. మరి ఇలాంటి టైం లో అక్షయ్ కుమార్ నుంచి మరో రీమేక్ వర్కౌట్ అవుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. తెలుగులో భారీ హిట్ అయ్యిన అల వైకుంఠపురములో హిందీలో చేస్తేనే జనం పెద్దగా ఆ సినిమాని అక్కడ పట్టించుకోలేదు. మరి ఈ ఎంటర్టైనర్ కి ఎలాంటి స్పందన ఉంటుందో కాలమే నిర్ణయించాలి.

Exit mobile version