ఈసారి అయినా రవితేజను విజయం వరిస్తుందా?

ఈసారి అయినా రవితేజను విజయం వరిస్తుందా?

Published on Dec 21, 2012 2:30 AM IST

Sarocharu
రవితేజ రాబోతున్న చిత్రం “సారోచ్చారు” డిసెంబర్ 21న విడుదలకు సిద్దమయ్యింది. రవితేజ విజయాన్ని ఆస్వాదించి చాలా రోజులు అవుతుంది, అయన గత చిత్రాలు “నిప్పు, “దేవుడు చేసిన మనుషులు” మరియు “దరువు” బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చవి చూసాయి. “సారోచ్చారు” చిత్రం విజయం సాదించడం ఇప్పుడు రవితేజ కెరీర్లో కీలకం అవ్వనుంది. ఆశ్చర్యకరంగా ఈ చిత్రం ప్రచారం లేకుండా విడుదల అవుతుంది. రవితేజ ఈ చిత్రంలో విభిన్నంగా కనపడుతుండటం మీదనే అందరి కళ్ళు ఉన్నాయి. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి సెన్సార్ వారు “U” సర్టిఫికేట్ మంజూరు చేశారు. కాజల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ లు ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మర కాసేపట్లో రవితేజ విజయపథంలోకి వచ్చార లేదా అన్న విషయం తెలిసిపోతుంది.అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు