రానా అంగవైకల్యంతో కనిపించనున్నాడా..!

నిన్న రానా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ హాతి మేరే సాథీ టీజర్ విడుదలైంది. అడవిలోఉండే జంతువులతో మేమేకమై జీవించే ఓ వ్యక్తి వాటి మనుగడ కోసం చేసే పోరాటమే ఈ చిత్రం. అడవిలో మధ్యలో ఓ టౌన్ షిప్ నిర్మాణం కారణంగా ఏనుగులు జీనాధారమైన నీటిని కోల్పోతాయి. దీనితో హీరో రానా బలిసిన ఆ వ్యక్తులను ఎదిరించి అడవి మనుగడను ఎలా కాపాడాడు అన్నదే కథ. ఇక ఈ చిత్రంలో రానా లుక్ చాల డిఫరెంట్ గా ఉంది. ఆయన ఈ చిత్రంలో పాక్షికంగా అంగవైకల్యం కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన గూనితో కనిపిస్తున్నాడు.

హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషలలో ఈ చిత్రం విడుదల అవుతుంది. తెలుగులో అరణ్య పేరుతో విడుదల అవుతుండగా, తమిళంలో కాడన్ అనే టైటిల్ తో విడుదల కానుంది. ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రభు సోలొమన్ తెరకెక్కిస్తున్నాడు.

Exit mobile version