పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ చిత్రమే ఓజి. పవన్ కోసం ఒక స్ట్రాంగ్ బేస్ ఉన్న యూనివర్స్ ని సుజీత్ సిద్ధం చేసాడు. దీనితో ఈ సినిమా నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ల పట్ల మంచి హైప్ ఇప్పుడు నెలకొంది. ఇక ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సాలిడ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు.
అయితే ఫ్యాన్స్ మాత్రం ఓటిటి వెర్షన్ లో ఒకటే కోరుకుంటున్నారు. ఓజి ఓటిటిలో కాస్త ఆ డిలీటెడ్ సీన్స్ ఏదో యాడ్ చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన తలలు జాగ్రత్త లాంటి డైలాగ్స్ థియేటర్ లో లేకపోవడంతో బాగా డిజప్పాయింట్ అయ్యారు. మరి ఇలాంటివి ఏమన్నా ఓటిటి వెర్షన్ లో ఉంటాయా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలి అంటే ఏ అక్టోబర్ 23 వరకు ఆగాల్సిందే.