మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపాయి. కొన్ని సినిమాలు వాయిదా పడగా ఆయన ప్రస్తుతం “కొరియన్ కనకరాజు” చిత్రంపై దృష్టి పెట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అధిక శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్ర షూటింగ్ నవంబర్ చివరినాటికి ముగించనున్నారు.
తాజాగా వరుణ్ తేజ్, విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందనున్న ఓ లవ్ స్టోరీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గతేడాదే ఫైనల్ అయినప్పటికీ, అనేక కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు వరుణ్ డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు డేట్స్ కేటాయించగా, వచ్చే ఏడాది అమెరికాలో కీలక షెడ్యూల్ జరగనుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆయనకు తిరిగి మంచి బూస్ట్ ఇవ్వగలదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.