ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి అతి తక్కువ సమయంలో తనకంటూ మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అయితే, గతకొద్ది చిత్రాలు సరిగా ఆడకపోవడంతో కృతి శెట్టి కాస్త వెనుకబడింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
అయితే, ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు గోవింద తనయుడు యశ్వర్ధన్ అహుజ హీరోగా నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా బాలీవుడ్‌లో లాంచ్ కానుంది. కానీ, ఇప్పుడు ఈ సినిమా నుంచి కృతి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
దీంతో కృతి శెట్టి బాలీవుడ్ కల కలగానే ఉండిపోయిందని ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి బేబమ్మకు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు వస్తుందో చూడాలి.