ఆర్ ఆర్ ఆర్ పై వస్తున్న రోజుకొక వార్త అటు ఎన్టీఆర్ మరియు చరణ్ ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది. ఈ ఏడాది జులై లో విడుదల కలవాల్సిన ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జనవరి షిఫ్ట్ చేశారు. ఐతే ఈ మూవీ జనవరి నుండి సమ్మర్ కి వాయిదా పడుతుందని కొన్ని వార్తలు వస్తుండగా… కొందరు ఏకంగా 2021 జులై కి ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదాపడుతుందని అంటున్నారు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నుండి ఆర్ ఆర్ ఆర్ కంటే ముందు త్రివిక్రమ్ మూవీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ తన 30వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రకటించగా అది లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి వెళుతుంది. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని 10నెలల లోపే చుట్టేయడం ఖాయం. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ విడుదల జులై కి వాయిదా పడితే త్రివిక్రమ్ మూవీ ముందే విడుదల కావచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే ఆయన్ని వెండి తెరపై చూసి ఏడాదిన్నర అవుతుంది. కాబట్టి ఈ రెండు చిత్రాలలో ఏది విడుదల అయినా పండగ చేసుకోవడం ఖాయం.