అక్కడ 70 వేలకి పైగా టికెట్స్ తో ర్యాంపేజ్!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఊహించని రీతిలో ఎదురు చూస్తున్నారు. ఇలా పవర్ స్టార్ తాండవం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా యూఎస్ మార్కెట్ లో ఓజి మేనియా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది. ఇలా నార్త్ అమెరికా ప్రాంతంలో కేవలం ప్రీ సేల్స్ లోనే ఏకంగా 70 వేలకి పైగా టికెట్స్ ఓజి చిత్రానికి తెగాయి.

దీనితో ఓజి సినిమా ఫీవర్ అక్కడ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ట్రైలర్ వచ్చాక ఈ లెక్కలు మరింత అయ్యినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి తదితరులు నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version