పిక్ ఆఫ్ ది డే: ‘ఓజి’.. మూడు తలల డ్రాగన్ టెంప్లేట్.. సుజీత్ క్రేజీ పోస్ట్

og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని తన ఫ్యాన్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా అభిమానుల్లో మొదటి నుంచీ మంచి హైప్ ని సెట్ చేసుకుంది. అయితే ఈ చిత్రానికి తాను కాదు హీరో దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్ లే మొదటి రెండో హీరోలు అని పవన్ చెప్పడం వైరల్ గా మారింది.

దీనితో ఈ ముగ్గురు కలయిక ఈవెంట్ లో మరింత ఎగ్జైట్ చేసింది. అయితే సోషల్ మీడియాలో ఒక మూడు తలల డ్రాగన్ టెంప్లేట్ చాలా మందికి తెలిసిందే. అంటే మూడు పవర్ఫుల్ ఫోర్స్ లు కలిస్తే వాటి కలయిక ఎలా ఉంటుందో అన్నట్టు దానికి ప్రతీకగా చాలా మంది పోలుస్తారు. మరి అదే రీతిలో తమ ముగ్గురి త్రయం అంటూ డ్రాగన్ కి మూడు తలలు ఉంటాయి అన్నట్టుగా సుజీత్ చేసిన పోస్ట్ పవన్, తాను థమన్ లపై పిక్ ఇవాళ్టికి పిక్ ఆఫ్ ది డే గా మారింది.

Exit mobile version