దసరాకి డమరుకం సెన్సేషన్ కానుందా?

దసరాకి డమరుకం సెన్సేషన్ కానుందా?

Published on Oct 13, 2012 9:57 AM IST

కింగ్ అక్కినేని నాగార్జున నటించిన సోషియో ఫాంటసి చిత్రం డమరుకం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 19న విడుదలకు సిద్ధమవుతుంది. సెన్సార్ సభ్యులు యూ/ఎ సర్టిఫికేట్ అందించిన ఈ చిత్రంలో చివరి 45 నిముషాలు గ్రాఫిక్స్ వండర్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కంటెంట్ తో పాటుగా గ్రాఫిక్స్ బావుంటే ఆ సినిమాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారని గతంలో అరుంధతి లాంటి సినిమాలు నిరూపించాయి. నాగార్జున కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ 40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ అధ్బుతంగా ఉన్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాద్ క్రేజీ కాంబినేషన్లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా ఈ వారంలోనే వస్తుండటంతో బెట్టింగ్స్ కూడా మొదలయ్యాయి.

తాజా వార్తలు