‘ఘాటి’ కోసం అనుష్క సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా..?

‘ఘాటి’ కోసం అనుష్క సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా..?

Published on Jun 6, 2025 12:06 AM IST

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ అంచనాలను రెట్టింపు చేశాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. జూలై 11న ఘాటి చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో చేసి సినిమాపై మరింత బజ్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా కోసం అనుష్క తన సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తన గత చిత్రాలకు అనుష్క ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. ఆమె ఒకట్రెండు ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితం అయ్యేది. మరి ఇప్పుడు ఘాటి చిత్రం ఆమెతో పాటు దర్శకుడు క్రిష్‌కు కూడా చాలా కీలకం. మరి ఇలాంటి సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు ఈ జేజమ్మ బయటకు వచ్చి ప్రమోషన్స్‌లో పాల్గొంటుందా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు