రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా కొనసాగుతా – బాలకృష్ణ

balakrishna
ఇటీవలే విడుదలైన ‘లెజెండ్’ సినిమా సక్సెస్ తో నందమూరి బాలకృష్ణ చాలా ఆనందంగా ఉన్నాడు. అలాగే బాలకృష్ణలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ఈ సినిమా విజయయాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ థియేటర్స్ లో ప్రేక్షకులను కలుస్తున్నారు.

ఇదిలా ఉంటే త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయనున్నానని బాలకృష్ణ అనౌన్స్ చేసారు. అభిమానులు అందరూ ఆయన ఒకసారి రాజకీయాల్లోకి వెళితే మళ్ళీ సినిమాలు చేయరేమో అని ఆందోళన పడుతున్నారు. సింహాచలంలో అప్పన్నను దర్శించుకున్న బాలకృష్ణ అభిమానుల్లో ఉన్న ఈ అనుమానాలను క్లియర్ చేసాడు.

బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ‘రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాను. కానీ ఎక్కడ నుంచి పోటీచేస్తాననేది లెజెండ్ విజయ యాత్ర తర్వాత తెలియజేస్తాను. మా నాన్నగారి ఆశయాల కోసం రాజకీయాల్లో కొనసాగుతా, అలాగే అభిమానుల కోసం సినిమాల్లో కూడా నటిస్తూ వాళ్ళని రంజింపజేస్తానని’ అన్నారు. రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తాను అనడంతో అభిమానులు కాస్త హ్యాపీగా ఉన్నారు.

Exit mobile version