“మాస్ జాతర” రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

Mass-Jathara

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా ‘ధమాకా’ లాంటి భారీ సక్సెస్ తర్వాత చేస్తున్న అవైటెడ్ చిత్రమే “మాస్ జాతర”. దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కించిన ఈ చిత్రం కోసం రవితేజ అభిమానులు ఎప్పుడునుంచో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పుడు వరకు అలా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ పై నిర్మాత నాగవంశీ లేటెస్ట్ క్లారిటీ ఇచ్చారు.

ఈ అక్టోబర్ 2న దసరా మహోత్సవం కానుకగా తాము మాస్ జాతర రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో మాస్ జాతర ఎప్పుడు అనేది ఆరోజు తెలుస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ సహా ఫార్చూన్ ఫోర్ సినిమా అలాగే శ్రీకర స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version