పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి కీలక పాత్రల్లో నటించారు.
ఈ సమయంలో టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ OGకి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే మిరాయ్ చిత్ర బృందం, తమ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో OG షోలు వేసేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా లిటిల్ హార్ట్స్ నిర్మాత బన్నీ వాస్ కూడా OGకి మద్దతుగా నిలిచారు.
ఓజీ ప్రీమియర్ షో కోసం లిటిల్ హార్ట్స్ ప్రదర్శిస్తున్న థియేటర్లలో సహకారం అందించాలని ఆయన డిస్ట్రిబ్యూటర్స్‌ను కోరారు. దీంతో పవన్ సినిమాను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర పరిశ్రమ నుంచి అందరూ ముందుకు రావడం విశేషం అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, DVV ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.