ఈ ఏడాదిలో సౌత్ సినిమా నుంచి భారీ హైప్ ని సొంతం చేసుకున్న పలు చిత్రాల్లో తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేసిన “కూలీ” ఒకటి కాగా ఇపుడు మన తెలుగు నుంచి వస్తున్న చిత్రం “ఓజి” కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటో చూపిస్తున్న ఈ సినిమా పవన్ కెరీర్ లోనే ఒక రికార్డు బ్రేకింగ్ ఓపెనర్ గా నిలిచేందుకు సిద్ధం అయ్యింది.
ఇక ఈ చిత్రం ఓపెనింగ్స్ మూమెంట్ చూస్తుంటే సూపర్ స్టార్ కూలీ ఓపెనింగ్స్ దగ్గరకి వచ్చేలా ఉందని ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. కూలీ ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మేర ఓపెనింగ్స్ సాధించగా ఇదే రేంజ్ ఓపెనింగ్స్ ఓజి కి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తుంది. అయితే కూలీ చిత్రంకి ఓవర్సీస్ మార్కెట్ లో ఎక్కువ వసూళ్లు ప్లస్ అయితే ఓజి చిత్రానికి ప్రీమియర్ రోజు వసూళ్లు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. ఇలా మొదటిరోజుకి మాత్రం కూలీ రేంజ్ ఓపెనింగ్స్ ఓజి చిత్రానికి వచ్చే హైప్ ఇపుడు కనిపిస్తుంది.