బాలయ్యకి ఇది నిజంగా గడ్డు పరిస్థితే !

బాలయ్యకి ఇది నిజంగా గడ్డు పరిస్థితే !

Published on Apr 28, 2020 9:00 AM IST

నటసింహం బాలయ్య సినిమాల పై ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపించడం లేదు. జై సింహా, పైసా వసూల్, ఎన్టీఆర్ బయోపిక్ ఇలా బాలయ్య సినిమాల ప్లాప్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా బాలయ్య గత సినిమా ‘రూలర్’ సినిమా పరిస్థితి మరీ దారుణం. ఎందుకో ప్రేక్షకులతో పాటు బాలయ్య అభిమానులు కూడా బాలయ్య సినిమాలను లైట్ తీసుకుంటున్నారు. ఫ్యాన్స్ తో పాటు మాస్ కి కనెక్ట్ అయ్యేలా సినిమాని పవర్ ఫుల్ గా తెరకెక్కించి వదిలినప్పటికీ.. బాలయ్య సినిమాల్లో ఎక్కువుగా రొటీన్ బోరింగ్ యాక్షన్ ఉండటం.. పైగా అలాంటి బిల్డప్ యాక్షన్ షాట్స్ లో బాలయ్య బాబును చూసి చూసి బాగా బోర్ కొట్టడంతో ఆ సినిమాల పై బజ్ రాకుండా పోతుంది.

దీనికి తోడు రొటీన్ కథ.. ముఖ్యంగా సమాజంలో అన్యాయం జరగడం.. దాంతో మన బాలయ్య బాబు రెచ్చిపోయి తెగ నరికి ఆ అన్యాయాన్ని అరికట్టడం ఇలాంటి పరమ రొట్ట కొట్టుడు సినిమాలకు ఇకనైనా నటసింహం ఎండింగ్ కార్డు ఇవ్వకపోతే కష్టమే. హిట్ మాట తర్వాత సంగతి, ఇక నుండి బాలకృష్ణ సినిమాలకు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావనేది కాదనలేని నిజం. దానికి ఉదాహరణనే ఆయన గత సినిమాల పరిస్థితి.

అందుకే ఇక నుండైనా బాలయ్య కొత్తగా సినిమాలను ప్లాన్ చేసుకోవాలని, వయసుకు తగ్గ పాత్రలనే హీరోలుగా మలుచుకుని సినిమాలు చేయాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి బాలయ్య ఇప్పటికైనా అభిమానుల అంతరంగాన్ని గమనిస్తే బాగుండు. ప్రస్తుతం బాలయ్య బోయపాటితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేక ముచ్చట అక్కర్లేదు. అయితే ఈ సినిమా ఫలితం బోయపాటి గత సినిమాలా ఉంటే మాత్రం బాలయ్య మార్కెట్ మరింతగా పడిపోతుంది. పాపం బాలయ్యకి ఇది నిజంగా గడ్డు పరిస్థితే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు