‘ఓజి’ పై థమన్ మాస్ రివ్యూ!

‘ఓజి’ పై థమన్ మాస్ రివ్యూ!

Published on Sep 21, 2025 9:04 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ సహా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో వర్షం కారణంగా అనుకున్న రీతిలో అవ్వనప్పటికీ చిత్ర యూనిట్ కూడా ఎక్కడా తగ్గలేదు. అలా థమన్ ఇచ్చిన స్పీచ్ కూడా మంచి పవర్ఫుల్ గా ఇచ్చాడు.

అయితే తాను పెద్దగా మాట్లాడకుండా సింపుల్ గా తేల్చేసాడు. ఓజి కోసం చెప్పడం కాదు అంటూ మీసం మెలేసాడు. అంతే ఇదే ఓజి రివ్యూ అంటూ ఒక మాస్ రివ్యూ ఇచ్చి పడేసాడు. దీనితో ఓజి విషయంలో తాను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనేది మళ్ళీ ప్రూవ్ అయ్యింది. ఇది వరకు కూడా ఓసారి ఇలానే మీసం మెలేసి చెప్పాడు మనం ఓజి తో అందరికీ సమాధానం అందిస్తున్నాం అని తెలిపాడు. మళ్ళీ అదే కాన్ఫిడెన్స్ ని చూపిస్తున్నాడు. దీనితో తన రివ్యూ వైరల్ గా మారింది.

తాజా వార్తలు