ప్రస్తుతానికి ఇది అంతుచిక్కని ప్రశ్న. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం దాదాపుగా ఖరారైన నేపధ్యంలో ఈ ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్ళలో కదలాడుతుంది.
సమాజానికి ఏదో మంచి చేద్దాం అన్న ఆశతో మనముందుకు వస్తున్న పవన్ కు అండగా ఎవరు నిలుస్తారు అన్నది ఇప్పుడు సంచలనాంశంగా మారింది. సినీ ప్రముఖులు, ఇతర సెలెబ్రిటీలు ఈ లిస్టు లో వుండచ్చని అంచనా. ఈ ప్రశ్నలన్నిటికీ ఈ నెల 14న పవన్ సమాదానమివ్వనున్నాడు.
మాధాపూర్ హైటెక్స్ గ్రౌండ్స్ లో ఈ మీటింగ్ ఉండనుందని, తన పార్టీ ఎజెండా గురించి దాదాపు గంట ఉపన్యాసం ఇవ్వనున్నాడని సమాచారం. రాష్ట్ర విభజన నేపధ్యంలో పవన్ రాజకీయ ప్రవేశం మరింత ఆసక్తికరంగా మారిందనడంలో అతిశయోక్తిలేదు.