విజయ్ సేతుపతి పాత్రలోకి ఎవరు వస్తారు?

విజయ్ సేతుపతి పాత్రలోకి ఎవరు వస్తారు?

Published on Jul 18, 2013 1:10 PM IST

Vijay-Sethupathi

తమిళ్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘సూడు కవ్వం’ సినిమా అటు విమర్శకుల పరంగా, ఇటు కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. విజయ్ సేతు పతి ఇప్పుడు తమిళ సినిమా ఫిల్మ్ మేకింగ్ లో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నాడు. అతను సినిమాకి కింగ్ స్క్రిప్ట్ అనే దాన్ని నిరూపిస్తున్నాడు. మేము విన్న సమాచారం ప్రకారం ‘సూడు కవ్వం’ తెలుగు రీమీక్ రైట్స్ ని పివిపి సినిమా వారు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి పాత్ర పాత్రలో నటించే అవకాశం తెలుగులో ఎవరు దక్కించు కుంటారా? అనేది ఆసక్తిగా మారింది. అంతకు మించి ప్రస్తుతానికి ఇక ఏ వివరాలు తెలియజేయలేదు. ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ కి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విజయ్ సేతుపతి నటించిన ‘పిజ్జా’ సినిమా ఆంధ్రప్రదేశ్ లో మంచి విజయాన్ని అందుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు