రేపటి బాక్స్ ఆఫీసు విజేత ఎవరు?


ప్రతి వారం బాక్స్ ఆఫీసు వద్ద ఏదో ఒక సినిమా లేదా సినిమాలు సందడి చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటాయి. ఈ వారం కూడా మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి వస్తున్నాయి. అవే పైసా’, ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’ మరియు ‘దిల్ దివానా’.

ఈ మొద్దిన్తిలొ మొదటగా కాస్త క్రేజ్ ఉన్నది ‘పైసా’. నాని హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రజల్లో కాస్త అంచనాలున్నాయి. కేథరిన్, లక్కీ శర్మ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి రమేష్ పుప్పాల నిర్మాత. చాలా కాలం ఫైనాన్సియల్ గా ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు రేపు విడుదలవుతోంది.

ఇక రెండవది, తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న శ్రీ కాంత్ హీరోగా నటించిన ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విజయం పై శ్రీ కాంత్ చాలా నమ్మకంగా ఉన్నాడు.

ఇక చివరిగా నూతన నటీనటులను తెరకు పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ తుమ్మ కిరణ్ డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన సినిమా ‘దిల్ దివానా’. స్వీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.

ఓవరాల్ గా ఈ మూడు సినిమాల ద్వారా సీనియర్ హీరోలు, డైరెక్టర్స్ బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధిస్తారా లేక కొత్త వాళ్ళు తమ టాలెంట్ నిరూపించుకొని బాక్స్ ఆఫీసు విజేతలుగా నిలబడుతారో చూడాలి.

Exit mobile version