తరువాత సినిమా బన్నీతోనా.. ఎన్టీఆర్ తోనా ?

తరువాత సినిమా బన్నీతోనా.. ఎన్టీఆర్ తోనా ?

Published on Aug 16, 2020 3:00 AM IST


మాటల రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో ప్రముఖంగా వినిపించే పేరు కొరటాల శివ. ఇప్పుడు కొరటాల సినిమా అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆయన సినిమా. అందుకే చోటా హీరోల దగ్గర నుంచి ఎన్టీఆర్, మహేష్, మెగాస్టార్ వరకు ఆయనతో సినిమా చెయ్యటానికి ఆసక్తి చూపుతున్నారు.

కాగా కొర‌టాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల చేయబోయే సినిమా అల్లు అర్జున్ తోనే అని ఇటీవలే వార్తలు వచ్చాయి. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ తో సినిమా త‌ర్వాత కొర‌టాల, బన్నీతో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారట.

కాకపోతే కొరటాల ఎన్టీఆర్ తో కూడా ఇప్పటికే ఒక సినిమా కమిట్ అయి ఉన్నాడు. ఈ సినిమాని మొదట 2021లో మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా వల్ల అన్ని సినిమాలు పోస్ట్ ఫోన్ అయ్యాయి. దాంతో తన తరువాత సినిమా ఎవరితోనో అనేది ఇప్పుడే చెప్పలేం అంటున్నాడు కొరటాల.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు