ఒకప్పుడు సంక్రాంతి సీజన్ అనగానే అగ్ర హీరో సినిమాలు పోటీ పడేవి. పందెం కోడిని సిద్ధం చేసినట్లు తమ సినిమాలని సంక్రాంతి రేసుకి సిద్ధం చేసే వారు. ఈ మధ్య కాలంలో పోటీ లేకుండా ఉండటానికి ఎవరి సినిమాని వారు సోలోగా విడుదల చేసుకుంటున్నారు. గత సంక్రాంతి సీజన్ చూస్తే వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరు పోటీ పడ్డారు. మహేష్ బిజినెస్ మేన్, వెంకటేష్ ‘బాడీగార్డ్’ రెండు సినిమాలు ఒకరోజు తేడాతో విడుదల కాగా బిజినెస్ మేన్ ముందు నిలిచింది. ఈసారి వీరిద్దరూ కలిసి సంక్రాంతి రేసుకి సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ నాయక్ సినిమాతో వీరితో ఈసారి పోటీ పడబోతున్నాడు. వివి వినాయక్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న నాయక్ మాస్ సినిమా అయితే జనవరి 9న విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కుతూ జనవరి 11న విడుదలవుతోంది. సంక్రాంతి సీజన్ ఇంకా నెలరోజులు ఉండగానే సందడి మొదలైంది. ఈసారి పోటీలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
ఈ సారి సంక్రాంతి రేసులో గెలిచేదెవరు?
ఈ సారి సంక్రాంతి రేసులో గెలిచేదెవరు?
Published on Dec 4, 2012 12:52 AM IST
సంబంధిత సమాచారం
- ఫోటో మూమెంట్ : ఇంటర్వెల్ ఎపిసోడ్ రికార్డింగ్లో ‘అఖండ 2’ టీమ్ బిజీ!
- బాక్సాఫీస్ దగ్గర స్ట్రగుల్ అవుతున్న ‘మదరాసి’
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- ఇంటర్వ్యూ : సూపర్ హీరో తేజ సజ్జా – ‘మిరాయ్’ అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది!
- టీమిండియా విజయ రహస్యం: శివమ్ దూబే అదృష్టం, సూర్యకుమార్ నాయకత్వం
- ట్రాన్స్ ఆఫ్ ఓమి.. విధ్వంసానికి మారుపేరు..!
- ‘ఓజి’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక ఇదేనా!?
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”