హైదరాబాద్‌లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?

హైదరాబాద్‌లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?

Published on Sep 11, 2025 5:00 PM IST

Demon Slayer

యానిమేషన్ సినిమాలకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత క్రేజ్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ‘డీమన్ స్లేయర్ : ఇన్ఫినిటీ క్యాసిల్’ ఇప్పుడు హైదరాబాద్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో ఈ సినిమా కోసం ఇప్పటికే 18,000కిపైగా టికెట్లు అమ్ముడుపోవడం సెన్సేషన్ అని చెప్పాలి. ఓ యానిమేటెడ్ బ్లాక్‌బస్టర్.. అందులోనూ జపనీస్ సినిమాకు ఇంత భారీ రెస్పాన్స్ రావడం నిజంగా విశేషమనే చెప్పాలి.

ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపటి నుంచి థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ మూవీకి మరింత అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

తాజా వార్తలు