ఈ సారి సంక్రాంతి రేసులో గెలిచేదెవరు?

ఈ సారి సంక్రాంతి రేసులో గెలిచేదెవరు?

Published on Dec 4, 2012 12:52 AM IST


ఒకప్పుడు సంక్రాంతి సీజన్ అనగానే అగ్ర హీరో సినిమాలు పోటీ పడేవి. పందెం కోడిని సిద్ధం చేసినట్లు తమ సినిమాలని సంక్రాంతి రేసుకి సిద్ధం చేసే వారు. ఈ మధ్య కాలంలో పోటీ లేకుండా ఉండటానికి ఎవరి సినిమాని వారు సోలోగా విడుదల చేసుకుంటున్నారు. గత సంక్రాంతి సీజన్ చూస్తే వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరు పోటీ పడ్డారు. మహేష్ బిజినెస్ మేన్, వెంకటేష్ ‘బాడీగార్డ్’ రెండు సినిమాలు ఒకరోజు తేడాతో విడుదల కాగా బిజినెస్ మేన్ ముందు నిలిచింది. ఈసారి వీరిద్దరూ కలిసి సంక్రాంతి రేసుకి సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ నాయక్ సినిమాతో వీరితో ఈసారి పోటీ పడబోతున్నాడు. వివి వినాయక్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న నాయక్ మాస్ సినిమా అయితే జనవరి 9న విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కుతూ జనవరి 11న విడుదలవుతోంది. సంక్రాంతి సీజన్ ఇంకా నెలరోజులు ఉండగానే సందడి మొదలైంది. ఈసారి పోటీలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

తాజా వార్తలు