బాలు గారి ఆరోగ్యంపై తాజా అప్డేట్ ఏంటి?

బాలు గారి ఆరోగ్యంపై తాజా అప్డేట్ ఏంటి?

Published on Aug 30, 2020 11:59 AM IST

గత కొన్ని రోజులుగా మన భారతదేశ లెజెండరీ గాయకలు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు కరోనాతో పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని రోజుల వరకు ఎప్పటికప్పుడు సరైన అప్డేట్ లను ఆయన కుటుంబీకులే అందించే వారు. కానీ గత రెండు రోజుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన కానీ ఎస్ పి చరణ్ కూడా కానీ తెలుపడం లేదు. దీనితో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎవరికీ సరైన క్లారిటీ తెలియడం లేదు.

కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడినట్టు తెలుస్తుంది. అలాగే గత కొన్ని రోజుల కితం ఆయనకు లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల కాస్త క్రిటికల్ గా ఉందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అది కూడా తగ్గిందని అలాగే ఆయన వైద్యులు అందిస్తున్న చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని తెలుస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ కుటుంబీకులు నుంచి అధికారిక అప్డేట్ కోసం ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

తాజా వార్తలు