‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ప్లాన్స్ ఏమిటి?

Bahubali

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 2015లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి వరకూ ప్రభాస్ మరో సినిమాకి సైన్ చేయకుండా బిజీగా ఉండనున్నాడు. ఇప్పుడు అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న ఏమిటంటే ‘బాహుబలి తర్వాత ప్రభాస్ ప్లాన్స్ ఏమిటి?’. మామూలుగా ‘బాహుబలి’ లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత వచ్చే సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి.

అలాగే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ కూడా ఒక రేంజ్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడే ప్రభాస్ ఆచి తూచి అడుగులు వేయాల్సి వస్తుంది. ప్రభాస్ బాహుబలి పూర్తికాగానే తన సొంత బ్యానర్ లో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అలాగే ఓ వీరుడు అనే ఇమేజ్ నుంచి బయటపడడం కోసం కాస్త లవ్ ఎంటర్టైనర్ లాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాడు.

ప్రస్తుతం ‘బాహుబలి’ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ ఓ భారీ వార్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నాలు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version