పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల వాయిదా పడింది. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా చూసారు. జూన్ ఫస్ట్ వీక్ లోగానే ట్రైలర్ వస్తోంది అంటూ టాక్ నడిచింది. కానీ మూడో వారం దగ్గర పడుతోంది, ట్రైలర్ పై క్లారిటీ లేదు. చిత్రబృందం నుంచి స్పందన లేదు. మరి జూలై లోపు హరి హర విడుదల కాకపోతే ఈ సినిమా పరిస్థితి ఏమిటి ?, ఆ తర్వాత రిలీజ్ అయ్యే ఓజి పై ఫ్యాన్స్ అటెన్షన్ మొత్తం వెళ్లిపోతుంది. మరి ‘హరిహర వీరమల్లు’ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.
కాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.