చిన్న సినిమాల షూటింగ్స్ పరిస్థితి ఏమిటి ?

చిన్న సినిమాల షూటింగ్స్ పరిస్థితి ఏమిటి ?

Published on Oct 5, 2020 7:12 PM IST


కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉంది, అయినా కొంతమంది ఇప్పటికే సినిమాల షూటింగ్స్ ను మొదలుపెట్టారు. సినిమా రంగం పై కరోనా విసిరిన పంజా దెబ్బకు చిన్న నిర్మాతల దగ్గర నుండి జూనియర్ ఆర్టిస్ట్ లు వరకూ అందరూ తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. అందుకే కష్టం అయినా షూటింగ్స్ కోసం అందరూ సన్నద్ధం అవుతున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. షూటింగ్ లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సెట్స్ లో ఎక్కువ జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది.

కాగా సెట్స్ లో పెద్ద నిర్మాతలు ఎలాగూ అన్ని రకాలుగా జాగ్రతలు తీసుకుంటున్నారు. కానీ చిన్న నిర్మాతలకు కష్టంగా మారిందట. ఎక్కువ జాగ్రతలు తీసుకోవాల్సి రావడంతో చిన్న సినిమాలకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ అవుతుందట, మరి ఇంత ఖర్చు పెట్టి చిన్న సినిమా తీసినా సినిమా రిలీజ్ గురించి ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ రిలీజ్ అయినా చిన్న సినిమాల కోసం జనం థియేటర్స్ కు వస్తారా అనేది డౌటే. మరి ఇలాంటి నేపథ్యంలో చిన్న సినిమాల షూటింగ్స్ చేయడం అవసరమా అని చిన్న సినిమాల మేకర్స్ ఆలోచనలో పడ్డారు.

తాజా వార్తలు