ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ ప్రాజెక్టులను తన చేతిలో ఉంచుకున్నాడు. అవన్నీ కూడా ఒకదాన్ని తలదన్నే మరొకటి అని చెప్పాలి. అలాంటి ప్రాజెక్టులను ప్లాన్ చేసుకున్న ప్రభాస్ కు ఒక సంశయం ఎదురైనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఒప్పుకున్నా మూడు ప్రోజెక్టులతూ పాటు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటుగా ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని స్ట్రాంగ్ బజ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రం ఈ అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తారని మరో రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నా అసలు ప్రభాస్ ప్లానింగ్ మాత్రం కాస్త ఛాలెంజింగ్ గానే ఉందని చెప్పాలి. దర్శకుడు రాధా కృష్ణతో తీస్తున్న “రాధే శ్యామ్” ఇక ఎలాగో కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత నాగశ్విన్ మరియు ఓం రౌత్ లతో కనీ వినీ ఎరుగని రేంజ్ ప్రాజెక్ట్ లను ప్లాన్ చేస్తున్నాడు. మరి వీటితో పాటుగా నీల్ తో మరో భారీ చిత్రం అంటే ఇంకా అదెప్పుడు మొదలవుతుంది.
ఒకపక్క మిగతా ఇద్దరు దర్శకులు తమ చిత్రాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ కూడా ఏకకాలంలో రెండు ప్రాజెక్టులలో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి అలాంటప్పుడు ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ ను ఎప్పుడు మొదలు పెట్టాలి అన్నది ప్రభాస్ కు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకే సమయంలో ఒకే లుక్ తో మూడు చిత్రాలు చెయ్యాలన్నా అలాగే మార్చి మార్చి చెయ్యాలన్నా చాలా సమయం కన్ఫార్మ్. దీనితూ ప్రభాస్ అండ్ నీల్ ల కాంబో ఎప్పుడు మొదలు కానుంది అన్నది ప్రభాస్ చేతిలోనే ఉంది. మరి ఈ పాన్ ఇండియన్ స్టార్ ఎలా బ్యాలన్స్ చేస్తాడో చూడాలి.