దే’వర’ 2 పరిస్థితేంటి?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం భారీ హిట్ అవ్వడంతో పార్ట్ 2 పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు అలాగే స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే ఇపుడు వస్తున్న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఆల్రెడీ వార్ 2 ట్రీట్ ఖాయం అయ్యింది. దీనితో ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్ లేదని చెప్పేసారు. సో ఇక మిగిలి ఉన్నది దేవర 2 మాత్రమే. మరి దే’వర’ నుంచి కూడా ఎలాంటి అప్డేట్ ఉండదు అన్నట్టే ఇపుడు వినిపిస్తుంది. సో ఈ చిత్రం నుంచి కేవలం విషెష్ లాంటివి మాత్రమే వస్తాయి తప్ప అప్డేట్ ఉండకపోవచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని కూడా మేకర్స్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేయనున్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version