నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆల్రెడీ సందడి మొదలు పెట్టారు. ఇక ఈ పుట్టినరోజు కానుకగా మెగాస్టార్ నుంచి రాబోతున్న చిత్రాల్లో ఒకటైన భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” కూడా ఒకటి. మరి ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ ఒక ట్రోల్ గ్లింప్స్ తర్వాత ఈసారి వచ్చిన టీజర్ మాత్రం అందుకు ఛాన్స్ ఇవ్వకుండా ఉంది.
మరి ఈ టీజర్ కి తెలుగు కంటే ఎక్కువగా హిందీ వెర్షన్ లో ఎక్కువ వ్యూస్ వస్తుండడం గమనార్హం. నిన్న సాయంత్రం విడుదల చేసిన విశ్వంభర టీజర్ బ్లాస్ట్ తెలుగులో గత 12 గంటల్లో 2.2 మిలియన్ వ్యూస్ సాధిస్తే హిందీ వెర్షన్ కి మాత్రం 3.2 మిలియన్ వ్యూస్ ని 11 గంటల్లోనే అందుకుంది. దీనితో తెలుగు కంటే హిందీ వెర్షన్ లోనే ఈ గ్లింప్స్ వీక్షకులు చూడడం విశేషం. మరి ఇదే మూమెంటం విశ్వంభర కి కొనసాగితే నార్త్ ఇండస్ట్రీలో లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.