మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలను లైన్లో పెడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుస ట్రీట్స్‌ను ప్లాన్ చేశారు చిరు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ చిత్రాల్లో ఒకటైన దర్శకుడు బాబీతో మూవీ గురించి కూడా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
గతంలో చిరుతో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని తెరకెక్కించిన బాబీ ఇప్పుడు మరోసారి తనదైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను అభిమానులకు అందించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.
చిరు-బాబీ కాంబినేషన్లో రానున్న రెండవ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను చిరు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 22న సాయంత్రం 5.13 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.