విభిన్న శైలి ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రకటనలతో సినిమా ప్రేక్షకులని మరియు మీడియాని పక్కదోవ పట్టిస్తున్నారు. ఇటీవల ఆయన శ్రీ రామరాజ్యం జనం నోళ్ళలో బాగా నానుతుండటం చూసి తాను కూడా రామాయణాన్ని ‘రామాయణ’ పేరుతో రిమేక్ చేస్తానని ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు. రామాయణ ముంబైలో మొదలవుతుందని, దశరద్ అయోధ్య ఇండస్ట్రీస్ అధినేత, రావణ రాజ్ లంక ఇండస్ట్రీస్ అధినేత వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటాడు. దశరద్ కొడుకు రామ్ శంకర్ ఆ సమస్యలు ఎలా పరిష్కరించాడు అంటూ తనదైన శైలిలో రామాయణాన్ని వివరిస్తా అంటూ చెప్పాడు. ఇదే కాకుండా పెళ్లి మరియు అమ్మ అని మారి కొన్ని సినిమాలు ప్రకటించడం ఆయనకి పరిపాటి అయింది. ఎప్పుడూ మీడియా తన మీదే ఫోకస్ చేయడానికి ఇలాంటి వింత ప్రకటనలు చేయడం ఆయనకి అలవాటయింది.