పవన్ డైరెక్టర్ నిర్మాణంలో వెబ్ ఫిల్మ్ !

పవన్ డైరెక్టర్ నిర్మాణంలో వెబ్ ఫిల్మ్ !

Published on Oct 5, 2020 10:13 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నిర్మాతగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఆహా కోసం ఓ వెబ్ ఫిల్మ్ ను హరీష్ శంకర్ నిర్మించబోతున్నాడు. పైగా ఈ వెబ్ ఫిల్మ్ కి హరీష్ శంకర్ నే స్వయంగా స్క్రిప్ట్ కూడా రాస్తున్నాడట.
అయితే నిర్మాత బన్నీ వాసుతో కలిసి హరీష్ శంకర్ ఈ వెబ్ ఫిల్మ్ ను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ కరోనా ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్ ను కూడా మొదలు పెడతారట.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ కు హరీష్ శంకర్ ప్రస్తుతం ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయనే నమ్మకం ఉంది. ‘వకీల్ సాబ్’తో పాటు క్రిష్ సినిమా కూడా పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.

తాజా వార్తలు