మన సినిమాలకు మనమే మంచి విమర్శకులం: కె.ఎల్ దామోదర్ ప్రసాద్

మన సినిమాలకు మనమే మంచి విమర్శకులం: కె.ఎల్ దామోదర్ ప్రసాద్

Published on Sep 28, 2013 3:00 AM IST

kl-damodar-prasad
సున్నితమైన కధాంశాలతో హృదయానికి హత్తుకునే సినిమాలు తీయడం కె.ఎల్ దామోదర్ ప్రసాద్ వంతు. ప్రస్తుతం పలుచోట్ల ఆయన నిర్మించిన ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమా ఆరో వారం మంచి వసూళ్లతో కొనసాగుతుంది

ఇటీవలే ఈ సినిమా బృందం సినిమా విజయయాత్రను నిర్వహించింది. అక్కడ ప్రసాద్ మాట్లాడుతూ “నిజామాబాద్ లో ఒక ముందువరుస ప్రేక్షకుడు ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ ను మెచ్చుకున్నాడు. నిజానికి అతనికి ఈ విభాగానికి సంబంధించిన టెక్నికల్ విషయాలు తెలియకపోయినా సినిమాటోగ్రాఫర్ పనితీరుని ప్రశంసించాడు. అలాగే ఒక సన్నివేశంలో మా అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ నెంబర్ ను 5సెకన్ల పాటూ స్క్రీన్ మీద చూపించాం. సినిమా విడుధాలైన తరువాత లెక్కలేనన్ని కాల్స్ ఆ నెంబర్ కి రావడం ప్రేక్షకుల గ్రహణశక్తిని తెలుపుతుంది” అని తెలిపారు

అంతేకాక ప్రతీసినిమాకూ దర్శకనిర్మాతలే మంచి విమర్శకులు అని, దాని ద్వారా తాము చేసిన పొరపాట్లను దిద్దుకుని మంచి సినిమాలను తియ్యగలరని తెలిపారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు