ఎవడుని వాయిదా వెయ్యాలనుకున్నాం. కానీ .. – దిల్ రాజు

ఎవడుని వాయిదా వెయ్యాలనుకున్నాం. కానీ .. – దిల్ రాజు

Published on Jul 22, 2013 4:41 PM IST

dilraju_yevadu
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘ఎవడు’ సినిమా ముందుగా అనుకున్నట్టు గానే జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుందని, రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని మీడియాకి తెలియజేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

దిల్ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ చరణ్ కి ఇప్పటికే చాలా కమర్షియల్ హిట్స్ ఇచ్చారు. ఈ సినిమా ఒకటిన్నర సంవత్సరం మేము పడ్డ కష్టానికి ఫలితం. వంశీ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ‘బృందావనం’ దగ్గర నుంచి ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు. ఈ సినిమా ఆడియన్స్ కి ఒక పండగలా ఉంటుంది. ఇది ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్ ఫిల్మ్. బన్ని స్పెషల్ అప్పియరెన్స్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని’ అన్నాడు.

అలాగే మాట్లాడుతూ ‘ ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతునదని మేము ఆశిస్తున్నాం. మేము ఫ్యామిలీ, యూత్ ఫుల్ ఫిల్మ్స్ నుండి బయటకి వచ్చి చేసిన సినిమా ఇది. మేము ఒక పెద్ద కమర్షియల్ హిట్ అందిచాలానుకున్నాం. ఆ సక్సెస్ ని ఎవడు అందిస్తుంది. ఎవడు జూలై 31 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని’ తెలిపాడు.

‘ఎవడు’ రిలీజ్ అయిన ఒక వారం గ్యాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలవుతోంది కదా అని అడిగితే దానికి దిల్ రాజు సమాధానమిస్తూ ‘ మేము ముందుగా ఎవడు వాయిదా వెయ్యాలని అనుకున్నాం కానీ సరైన తేదీ దొరకలేదు. అత్తారింటికి దారేది డేట్ అనౌన్స్ చేసేసారు, అలాగే జంజీర్ డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. కావున 31నే రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాం. కానీ దీనివల్ల ఎలాంటి సమస్య లేదు.. గదర్, లగాన్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి కానీ రెండూ ట్రెండ్ సెట్ చేసాయని’ అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు