తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కూలీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఈ చిత్ర ఆడియో లాంచ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చెన్నైలో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో తన పాత్ర అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుందని.. అందరికీ నచ్చేలా తన పాత్రను లోకేష్ డిజైన్ చేశాడని ఆయన తెలిపారు.
అంతేగాక, కూలీ చిత్రం చూస్తే, వంద భాషా చిత్రాలను చూసినట్లు ఉంటుందని.. అంత పవర్‌ప్యాక్డ్‌గా ఈ సినిమాను రూపొందించామని ఆయన తెలిపారు. రజినీ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఓ ఫైర్ వర్క్స్ అని ఆయన సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు. ఆగస్టు 14న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.