ఆర్ ఆర్ ఆర్ కి మళ్ళీ ఏం అవాంతరం వచ్చిందో?

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి అన్నీ అవాంతరాలే. ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టిన నాటినుండి అనేక కారణాల చేత షూటింగ్ సవ్యంగా సాగలేదు. దీనితో ఈ మూవీ దాదాపు ఏడాదికి వాయిదాపడింది. లాక్ డౌన్ కారణంగా మూడునెలలుగా షూటింగ్ కి బ్రేక్ పడగా, ప్రభుత్వాలు కొన్ని సడలింపులు మరియు అనుమతులు ఇవ్వడంతో షూటింగ్ తిరిగి ప్రారంభించే పనిలో రాజమౌళి నిమగ్నమై ఉన్నాడు. దీనికోసం ఆయన హైదరాబాద్ లో ఓ భారీ సెట్ కూడా నిర్మించడం జరిగింది.

ఐతే ప్రస్తుత నిబంధలు రీత్యా పరిమిత సిబ్బందితో ఈ చిత్రం తెరకెక్కించాల్సి పరిస్థితి ఏర్పడింది. దీనితో ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ చిత్ర షూటింగ్ కొద్దీ మందితో నిర్వహించడం ఎంత వరకు సాధ్యం అనేది తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచిదని భావించిన రాజమౌళి ట్రయిల్ షూటింగ్ నిర్వహించ తలచాడు. ఐతే కారణం ఏదైనా ఆ ట్రయిల్ షూట్ కూడా ఆగిపోయిందని సమాచారం. హైదరాబాద్ లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న తరుణంలో అనుమతులు వచ్చినా, ఎవరూ షూటింగ్స్ నిర్వహించడం లేదు.

Exit mobile version