మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ చిత్రం “వార్ 2” పట్ల ఇపుడు మంచి హైప్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ హిందీతో పాటుగా తెలుగులో కూడా అదే రీతిలో ఉన్నారు. మరి ముఖ్యంగా రెండు భాషల్లో గ్రాండ్ గా విడుదలకి రాబోతున్న ఈ సినిమా రెండు వెర్షన్ లలో స్వల్ప తేడాతో రానున్నట్టు తెలుస్తుంది.
తెలుగులో రన్ టైం 2 గంటల 51 నిమిషాలకి పైగా రన్ టైం తో వస్తే హిందీ వెర్షన్ మాత్రం 2 గంటల 53 నిమిషాలకి పైగా కట్ చేశారట. మరి ఈ స్వల్ప తేడాలో ఏం మారి ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ ఆగస్టు 14న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సినిమా రిలీజ్ కి రాబోతుంది.