ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వచ్చే వారం రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ కాగా, సెన్సేషనల్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర టికెట్ బుకింగ్స్ అవుతున్నాయి.
అటు బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న క్రేజీ స్పై సీక్వెల్ చిత్రం ‘వార్ 2’ కూడా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఆదివారం (ఆగస్టు 10) ఓపెన్ అవుతున్నాయి. కాగా ఈ సినిమా ప్రొడక్షన్ హౌజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ నార్త్ ఇండియాలోని 90 శాతం సింగిల్ స్క్రీన్స్‌లో ‘వార్ 2’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
ఇక కేవలం హిందీలోనే ఈ చిత్రం 5వేలకు పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతున్నట్లు బిటౌన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలు మినహాయిస్తే తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూలీ రిలీజ్ వేరే లెవెల్‌లో అవుతుంది. దాదాపు అన్ని ఏరియాల్లో ‘కూలీ’ ప్రభంజనం ఉండబోతుంది. ఇలా నార్త్ ఇండియాలో వార్ 2 థియేటర్లు కబ్జా చేస్తే, దక్షిణాదిన కూలీ రఫ్ఫాడిస్తున్నాడు. ఓవర్సీస్ మార్కెట్‌లో రెండు సినిమాలు కూడా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యాయి.