డే 2 బుకింగ్స్ లో ‘కూలీ’ని మించి ‘వార్ 2’ దే పై చేయి!

డే 2 బుకింగ్స్ లో ‘కూలీ’ని మించి ‘వార్ 2’ దే పై చేయి!

Published on Aug 16, 2025 9:00 AM IST

ఈ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా పాన్ ఇండియా ఆడియెన్స్ ని ఎంతగానో అలరించేందుకు వచ్చేసిన లేటెస్ట్ చిత్రాలే “వార్ 2” మరియు “కూలీ”. సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల నుంచి వచ్చిన ఈ సినిమాలు ఏది కూడా కంప్లీట్ బ్లాక్ బస్టర్ టాక్ ని సంతరించుకొనప్పటికీ బుకింగ్స్ పరంగా మాత్రం సెన్సేషన్ సెట్ చేసాయి.

విడుదల ముందు వరకు కూలీ అదరగొడితే విడుదల తర్వాత మాత్రం వార్ 2 డామినేట్ చేస్తుంది. ఇలా గత 24 గంటల్లో బుక్ మై షోలో కూలీ చిత్రానికి 6 లక్షల 89 వేలకి పైగా టికెట్స్ అమ్ముడు పోతే వార్ 2 కి మాత్రం ఏకంగా 7 లక్షల 45 వేలకి పైగా టికెట్స్ అమ్ముడు పోయాయి దీనితో రెండో రోజుకు మాత్రం వార్ 2 దుమ్ము లేపింది అని చెప్పాలి. ఇక మూడో రోజుకు సేల్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.

తాజా వార్తలు