వార్ 2 : సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్‌తో అభిమానులు ఖుష్..!

వార్ 2 : సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్‌తో అభిమానులు ఖుష్..!

Published on Aug 7, 2025 12:05 AM IST

War2

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయిన చిత్రం ‘వార్ 2’. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. కాగా ఈ సినిమా యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై వస్తుండటంతో నేషనల్ లెవెల్‌లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిందట. కాగా ఈ చిత్ర రన్‌టైమ్‌ను మేకర్స్ 3 గంటల 2 నిమిషాలకు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఎన్టీఆర్, హృతిక్‌లు బిగ్ స్క్రీన్స్‌పై పోరాడేందుకు సెన్సార్ బోర్డు కూడా ఓకే చెప్పిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజా వార్తలు